తగ్గిన బంగారం ధరలు...
- December 10, 2017
మహిళలకు శుభవార్త. నిన్నమొన్నటి వరకు ఆకాశాన్నంటిన బంగారం ధర మెల్లమెల్లగా దిగివస్తోంది. 30 వేల వరకు ఉన్న పదిగ్రాముల బంగారం ధర ఈ పది రోజుల్లోబాగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 27,310 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్ల ధర 29,190 రూపాయలకు చేరింది. మరో రెండు నెలల పాటు ఎటువంటి శుభకార్యాలు లేకపోవడంతో పాటు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పరిస్థితి ఆశావాహంగా ఉండడం.. బంగారం ధర తగ్గుదలకు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు.
నవంబర్ 30తో ముహూర్తాలు ముగిశాయి. శుక్రమూఢం కారణంగా వచ్చే ఫిబ్రవరి 19 వరకు మంచి ముహుర్తాలు లేవు. దీంతో వివాహాది శుభకార్యాలకు బ్రేక్ పడడంతో పాటు గత పదిరోజులుగా బంగారం కొనుగోళ్ళు మందకొడిగా సాగుతున్నాయి. స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో ఉండడంవల్ల కూడా పసిడికి డిమాండ్ తగ్గింది. షేర్లపై పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు కూడా పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







