రైలు ప్రమాదం లో ఆరు ఏనుగులు మృతి
- December 10, 2017
అత్యంత హృదయవిదారకమైన సంఘటన శనివారం రాత్రి జరిగింది. ఐదు పెద్ద ఏనుగులు, ఓ చిన్న ఏనుగు పిల్ల దుర్మరణం పాలయ్యాయి. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో గువాహటి-నహర్లాగున్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ ఏనుగులను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అస్సాంలోని సోనిత్పూర్ జిల్లా, బలిపర సమీపంలో ఈ దారుణం జరిగింది. ఈ ప్రాంతానికి ఏనుగుల వాటికగా మంచి పేరు ఉంది. గ్రామాలు విస్తరిస్తుండటంతో అడవుల నరికివేత జోరుగా సాగుతోంది. సోనిత్‌పూర్‌లో 70 శాతం అడవులు కనుమరుగయ్యాయి. అడవుల్లో నివసించే జంతువులకు రక్షణ ఉండటం లేదు. 2013-2016 సంవత్సరాల మధ్య దాదాపు 140 ఏనుగులు అసహజంగా మరణించాయి.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!