హీరోయిన్‌గా ప్రముఖ నటి కల్పన కుమార్తె
- December 10, 2017
హైదరాబాద్: ప్రముఖ నటి కల్పన కుమార్తె శ్రీమయి కథానాయికగా వెండితెరపై సందడి చేయనున్నారు. మలయాళ చిత్రం 'కున్జియమ్మయం అంజుమక్కళం'తో ఆమె నటిగా పరిచయం కాబోతున్నారు. సుమేష్‌లాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ జరగనుంది.
శ్రీమయి చెన్నైలో విజువల్ కమ్యునికేషన్ అభ్యసిస్తున్నారు. ప్రముఖ నటి, శ్రీమయి పిన్ని వూర్వశి ఓ సినిమా ఆడియో విడుదల వేడుకలో ఆమెను మీడియాకు పరిచయం చేశారు. వూర్వశి 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'మనమంతా' చిత్రాలతో గత ఏడాది తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమె జ్యోతికతో కలిసి నటించిన తమిళ చిత్రం 'మగలిర్ మట్టుం' ఇటీవల విడుదలై, మంచి విజయం సాధించింది.
కల్పన గత ఏడాది జనవరిలో కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆమెహైదరాబాద్‌లో మృతి చెందారు. 'వూపిరి' చిత్రంలో ఆమె చివరిసారి కనిపించారు. నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వంశీపైడిపల్లి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల