హెల్త్ ఫీజు లో కొత్త పెరుగుదల ఏమీ లేదు !!

- December 10, 2017 , by Maagulf
హెల్త్ ఫీజు లో కొత్త పెరుగుదల ఏమీ లేదు !!

కువైట్:  ప్రవాసీయులకు  అందించిన వైద్య సేవలకు అధిక  రుసుము వసూలు చేయటానికి ఆరోగ్య మంత్రి డాక్టర్ జమాల్ అల్-హర్బి నిరాకరించారు. ఇటీవలి రుసుము పెంపుదలతో మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడానికి మరియు వివిధ వైద్య విభాగాల్లో సేవలను అభివృద్ధి చేస్తాయని ఆయన చెప్పారు.130 కువైట్ దినార్ల నివాసితుల వార్షిక ఆరోగ్య బీమా గూర్చి ఇప్పటికీ అధ్యయనం చేయబడుతోంది. అత్యవసర కేసులు, గుండె జబ్బులు వంటి వ్యాధులకు కొత్త ఫీజుల నుండి ఇంటెన్సివ్ కేర్  రోగులు నిర్బంధంలో ఉన్నవారిని మినహాయించటానికి అనుమతివ్వాలని  హాస్పిటల్ మేనేజర్లను ఆదేశించినట్లు హర్బీ నొక్కి చెప్పారు. గత వారం అమీరి ఆసుపత్రిలో అత్యవసర హృదయ శస్త్రచికిత్స కోసం ఈజిప్టు దేశం నుంచి వచ్చిన ఒక రోగిని ఫీజుల విషయంలో కఠినంగా ఉండ శస్త్రచికిత్స నిరాకరించడంతో ఆ ప్రవాసీయుడు ఆసుపత్రిలో మరణించినట్లు వెలువడుతున్న వార్తలను ఆయన గట్టిగా ఖండించారు. అ ఆసుపత్రి మేనేజర్ డాక్టర్ అలీ అల్లాండహ్నను  తాను విచారించానని ఆ రోగికి ఒక బైపాస్ శస్త్రచికిత్స అవసరం అవుతుందని అందుకోసం 90 కువైట్ దినార్లు ఖర్చు అవుతుందని మాత్రమే చెప్పానని ఆ మేనేజర్ తనకు వివరించాడన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com