కళ్యాణం కావాలంటే.. పెళ్ళి కూతురు...కోర్టు అనుమతి పొందాలి !!
- December 10, 2017
సౌదీఅరేబియా: ' మేము ఎవరిని సూచిస్తే ...వారినే ఖచ్చితంగా పెళ్ళి చేసుకోవాల్సిందేనని తల్లితండ్రుల ఇక ఆ దేశంలో హుంకరించడానికి వీల్లేదు. అలాగే వరుడి తరుపున సైతం18 ఏళ్ళ వయసులోపు బాలికలకు పెళ్లి జరిపించాలంటే తప్పకుండా ఆ అమ్మాయి అనుమతి పొందాలని దాంతోపాటు ఆమె తల్లి, సంబంధిత కోర్టు అనుమతి పొందిన తర్వాతే పెళ్ళికొడుకు ఆమెను పెళ్లి చేసుకోవాలని అడ్ హక్ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ తేల్చిచెప్పింది. సౌదీలో పెరిగిపోతోన్న బాల్య వివాహలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆ కమిటీని నియమించింది. 18 ఏళ్ల వయసు కంటే తక్కువ వయసు ఉన్నవారికి మాత్రమే మైనర్ హోదా వర్తిస్తుందని కమిటీ చెబుతోంది. మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే తాము సూచించిన అనుమతి పత్రాలు ప్రభుత్వానికి విధిగా సమర్పించాలని తర్వాతే పెళ్లి చేసుకోవాలని కమిటీ స్పష్టం చేస్తోంది. అలాగే పెళ్లికి ముందే మైనర్ అమ్మాయికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆ పత్రాలను కూడా కోర్టుకు సమర్పించాలని కమిటీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!