దోహలో 'దోహా కుటుంబం' వారి నేతృత్వంలో నేత్రపర్వంగా దీపావళి

- November 16, 2015 , by Maagulf

దోహాలో కార్నిష్ సమీపంలో ఉన్న ఎలిగెన్స్ కేజిల్ హోటల్ లో కతార్ లోని తెలుగు వారి ప్రముఖ సంస్కృతిక సంస్థ 'దోహా కుటుంబం' వారి నేతృత్వంలో తేది 13.11.15 న నేత్ర పర్వంగా నిర్వహింపబడ్డాయి. ఈ ఈవెంట్ లో 70 మంది దాకా పాల్గొన్నారు. ఈ దీపావళి సంబరాలు, చిన్నారుల ప్రార్ధనతో మహిళా మణుల జ్యోతి ప్రజ్వలనతో  సుభారంబమయ్యాయి. అనంతరం వారు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఇంకా  ఈ కార్యక్రమంలో కొందరు మహిళలు ఆవరణను రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. తరువాతి అంశాలుగా పిల్లల సోలో, డ్యూయెట్  మరియు బృంద నృత్య ప్రదర్సనలు,  స్త్రీమూర్తుల నృత్య గాన ప్రదర్శనలు సాగాయి.  పిల్లలు, పెద్దల కోసం ఆటల పోటీలు, పెళ్ళైన వారి సంయుక్త ఆటలు, సాముహిక క్రీడలతో అక్కడి వాతావరణం కోలాహలంగా మారింది. ఆబాలగోపాలం ఇక్కడకు విచ్చేసిన ఆటపాటల్లో మురిసిపోయారు. గ్రూప్ ఫోటోగ్రఫీ, బహుమతుల పంపిణీ తో ఈ కార్యక్రమానికి భరతవాక్యం పలికి, మరల త్వరలోనే కలసుకోనేందుకు ఉవ్విళ్ళూరుతూ  అందరూ వీడ్కోలు పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com