మాదకద్రవ్యం వికటించడంతో స్నేహితుడి మరణం... మృతదేహాన్ని దాచిపెట్టిన మిత్రబృందం
- December 11, 2017
దుబాయ్: వయస్సుని మించిన దురలవాట్లు ఆ యువకులను జైలు పాల్జేసింది. తమ తోటి ఓ స్నేహితుడు మాదకద్రవ్యంను ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అకస్మాత్తుగా చనిపోయాడు. మిగిలిన ముగ్గురు యువకులు నిర్ఘాంతపోయారు. తమ స్నేహితుడు ఆ విధంగా మరణించడంతో వారు తీవ్రంగా భయపడ్డారు. నేరాన్ని పోలీసులు తమపై నెడతారనే కారణంతో మృతదేహాన్ని ఎవరూ చూడని ఒక నిర్జన ప్రదేశానికి తరలించారు. కారును శుభ్రంగా కడిగి మృతదేహాన్ని కారులో ఉంచి ఎవరికీ కనిపించకుండా లహ్బాహ్ అనే ప్రాంతంలో దాచిపెట్టారు. మరణించిన యువకుడి సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేశారు. తిరిగి తమ తమ ఇళ్లకు వచ్చి తమకేమీ తెలియనట్టుగా నటించారు. కొడుకు కనిపించకపోవడంతో మృతుని తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు స్నేహితుడికి సంబంధించిన సమాచారం తమకేమీ తెలియదని ముగ్గరూ చెప్పారు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ముగ్గురిలో ఒకరు పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్పాడు. మృతదేహాన్ని తామే దాచిపెట్టామని తెలిపాడు. మాదక ద్రవ్యంను ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో స్నేహితుడు చనిపోయాడని, భయమేయడంతో ఈ పని చేశామని చెప్పాడు. స్పృహలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించామని, ప్రయోజనం దక్కలేదని తెలిపాడు. దీంతో నిందితులు ముగ్గురిపై కేసులు నమోదు చేసిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గత ఆగస్టులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసుపై కోర్టులో విచారణ మొదలైంది. నిందితుల వయసు 18, 19 సంవత్సరాలని, నిందితులందరూ విద్యార్థులని పోలీసులు తెలిపారు. ఈ ఘటన యూఏఈలోని దుబాయ్‌లో వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







