'మహానటి'గా మొదట సమంతనే అనుకున్నాం ..కానీ..
- December 11, 2017టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారిపై బయోపిక్ చిత్రాలు ఏవీ రాలేదు. మొదటి సారిగా అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా 'మహానటి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ మూవీ గురించిన పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది నిర్మాత స్వప్నా దత్. ఇందులో సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ నటిస్తుండగా సమంత ఓ కీలకపాత్ర పోషిస్తోంది.
దాదాపుగా సినిమా షూటింగ్ అంతా పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో సావిత్రి పాత్ర కోసం ముందు సమంతనే ఎంపిక చేశామని, కానీ ఆ పాత్రలో కొత్త వారిని తీసుకుంటే బావుంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పడంతో కీర్తిని ఫైనల్ చేశామని వెల్లడించింది. ఇందుకోసం సమంత సంతకం కూడా చేసేసింది.
కానీ సావిత్రి పాత్రలో కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని దర్శకుడు నాగ్‌అశ్విన్ భావించడంతో.. ఆ పాత్ర కోసం కీర్తిసురేష్‌ని ఎంపిక చేసి సమంతకు చిత్రంలో ఓ కీలక పాత్ర ఇచ్చేశాం. అలాగే ఈ మూవీని తెరకెక్కించాలనుకున్నప్పటి నుంచి చాలా పరిశోధనలు చేశామని, సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరిని కలిసి ఆమె గురించిన ఎన్నో విషయాలు తెలుసుకున్నామని తెలిపారు.
ఎలాంటి పాత్రలోనైనా ఆమె నటించి మెప్పించగలదని..పది సెకన్లలో వంద హావభావాలను పలికించగల గొప్ప నటి సావిత్రి అలాంటి మహానటి సినిమా తెరకెక్కిస్తుందన్నందుకు గర్వంగా ఉందని స్వప్నాదత్ చెప్పారు. తెలుగు, తమిళం, మలయాళంలో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల