అగ్ని ప్రమాదంలో వాహనం, భవనం దగ్ధం

- December 11, 2017 , by Maagulf
అగ్ని ప్రమాదంలో వాహనం, భవనం దగ్ధం

మనామా: ఈస్ట్‌ రిఫ్ఫాలో సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా ఓ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఓ భవనం కూడా అగ్నికీలలకు ఆహుతైంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ తలెత్తలేదు. సివిల్‌ డిఫెన్స్‌ డైరెక్టరేట్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా కారులో మంటలు తలెత్తాయనీ, ఆ అగ్ని కీలలకు భవనానికి వ్యాపించాయనీ, ఫైర్‌ ఫైటర్స్‌ అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేసేందుకు శ్రమించాయని తెలియవస్తోంది. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com