ఇక సైన్యంలో ట్రాన్స్జెండర్లకు చోటు.!
- December 11, 2017
అమెరికా సైన్యంలో ట్రాన్స్జెండర్ల నియామకాలు చేస్తున్నట్లు పెంటగాన్ వర్గాలు ప్రకటించాయి. అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుతో.. సైన్యంలోకి ట్రాన్స్జెండర్లను తీసుకుంటున్నట్లు పెంటగాన్ అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ ప్రక్రియ ఆరంభమవుతుందని పెంటగాన్ అధికార ప్రతినిధి డేవిడ్ ఈస్ట్‌బర్న్ చెప్పారు. సాయుధ దళాలలోకి ట్రాన్స్జెండర్లను తక్షణమే తీసుకోవాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు ఫెడరల్ కోర్టు తేల్చిచెప్పింది.
అమెరికా సాయుధ దళాలలోకి ట్రాన్సజెండర్లను తీసుకోవడంపై అధ్యక్షుడు ట్రంప్ ట్విటర్లో స్పందించారు. అమెరికా సైన్యంలోకి ట్రాన్స్జెండర్లను తీసుకోవడం అమెరికా ఆర్మీ ఉన్నతాధికారులు, రక్షణ రంగ నిపుణులు ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని కోరారు. అందులో.. ట్రాన్స్జెండర్లను సైన్యంలోకి తీసుకోవద్దని సూచించాలని ట్రంప్ కోరారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అమెరికా సాయుధ దళాల్లో 250 మంది ట్రాన్స్జెండర్లు విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల