న్యూజెర్సీలో సందడి చేయనున్న అఖిల్, రానా

- December 12, 2017 , by Maagulf
న్యూజెర్సీలో సందడి చేయనున్న అఖిల్, రానా

అక్కినేని అఖిల్, రానా న్యూజెర్సీ వెళ్లారు. ఈ సందర్భంగా అఖిల్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం హలో మూవీ ప్రమోషన్స్‌లో అఖిల్ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో తన సినిమాను ప్రమోట్ చేసిన అఖిల్ ప్రస్తుతం అమెరికాకు బయల్దేరాడు. అఖిల్ రీ లాంచ్ అవుతున్న మూవీ హలో. దీన్ని ఓవర్‌సీస్‌లో ప్రమోట్ చేయాలని ఈ యంగ్ హీరో డిసైడ్ అయ్యాడు. దీంతో మూడు రోజుల యూఎస్ టూర్‌ను ప్లాన్ చేసుకున్నాడు.

ఈ నెల 15, 16, 17 తేదీల్లో అక్కడ ప్రమోషనల్ క్యాంపెయిన్ ఉండబోతోంది. అఖిల్ న్యూజెర్సీ, డల్లాస్‌లో లైవ్ పెర్‌ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు. దీనికోసం అఖిల్‌తో పాటు రానా కూడా యూఎస్ పయనమయ్యారు. అఖిల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పిక్‌లో రానా కూడా కనిపిస్తున్నాడు. దీంతో అటు అక్కినేని, ఇటు దగ్గుబాటి అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా సక్సెస్‌పై అఖిల్, నాగార్జున చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com