పేద, మద్యతరగతి ప్రజలకు గృహ సదుపాయం కల్పించనున్న సౌదీ ప్రభుత్వం
- December 12, 2017
సౌదీ అరేబియా: ఆర్ధిక ఇబ్బందులతో సతమవుతున్న సౌదీ అరేబియాలో ఆర్థిక సంస్కరణలు అమలు జరపబోతున్నామని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు భారీగా తగ్గడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా పెద్ద ఎత్తున ఆయిల్ ఎగుమతుల్ని జరగనీయకుండా నిలువరించింది. దాంతో ఎన్నో చమురు కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. అలాగే పేద, మద్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెబుతూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పేద, మద్యతరగతి వారికి గృహ సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ డిసెంబర్లోనే ఈ పథకాన్ని అమలు చేయనున్నామని ప్రభుత్వం చెబుతోంది. నగదు రూపంలో ఇంటి యజమానికి ప్రభుత్వం హౌజింగ్ అలవెన్స్ చెక్ అందిస్తుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







