‘చంద్రన్న విలేజ్‌మాల్‌’ను ప్రారంభించిన చంద్రబాబు

- December 12, 2017 , by Maagulf
‘చంద్రన్న విలేజ్‌మాల్‌’ను ప్రారంభించిన చంద్రబాబు

అమరావతి: విజయవాడ, గుంటూరులో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ‘చంద్రన్న విలేజ్‌మాల్‌’ను సచివాలయం నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. పేదలకు నాణ్యమైన వస్తువులను అత్యంత చౌక ధరలకు అందించాలనే లక్ష్యంతో ‘చంద్రన్న విలేజ్‌మాల్‌’లు రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 28వేలకు పైగా ఉన్న చౌకధరల దుకాణాలను చంద్రన్న విలేజ్‌మాల్‌గా నవీకరిస్తున్నామని, మొదటి దశలో 6,500 రేషన్‌ షాపులు అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పేదలకు ప్రభుత్వం అందించే బియ్యం బదులుగా అంతే విలువకు కావాల్సిన వస్తువులు ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇందుకు అవసరమైన వస్తువుల సరఫరాకు మండలం, నియోజకవర్గం స్థాయిలో డిపోలు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. నిత్యావసర వస్తువులతో పాటు గృహోపకరణాలు, కిరణా సరకులు, సౌందర్య సాధనాలను మాల్‌లో విక్రయిస్తారని తెలిపారు. వివిధ బ్రాండ్లకు చెందిన 500కు పైగా ఉత్పత్తులు ఎంఆర్‌పీ కన్నా 4 నుంచి 35శాతం తక్కువ ధరకు లభిస్తాయని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com