దుబాయిలోని విల్లా లో అగ్నిప్రమాదం - తొమ్మిది మందికి గాయాలు
- November 16, 2015దుబాయిలోని మిర్దిఫ్ ఏరియా లోని ఒక విల్లా లో జరిగిన అగ్నిప్రమాదంలో సోమవారం తొమ్మిది మంది గాయాలపాలయ్యారు. ఈ సంఘటనను గురించి సమాచారమందుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్ రూం, పోలీసులు మరియు అగ్నిమాపక సిబ్బందితో కూడిన రక్షణ దళం, వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవంతిని, అందులో చిక్కుకున్న వ్యక్తులను కనుగొన్నారు. కేవలం 15 నిముషాల వ్యవధిలో పక్క భవనాలకు వ్యాప్తించకుండా మంటలను ఆర్పివేసి, భవనం లో వారికీ, పక్క భవనాలకు ప్రమాదం జరగకుండా కాపాడారు. తన గదిలో చిక్కుకుపోయిన ఒక సేవకురాలు తీవ్ర గాయాలకు గురి కాగా, తప్పించుకోవడానికి మొదటి అంతస్తు నుండి దూకిన ఇద్దరి కాళ్ళు విరిగినట్టు పొలిసు వారు తెలిపారు. గాయపడినవారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







