363 మంది కువైటీలకు హెచ్‌ఐవీ
- December 13, 2017
కువైట్: మొత్తం 363 మంది కువైటీ జాతీయులు హెచ్‌ఐవీ బారిన పడ్డారనీ, వారికి వైద్య చికిత్స అందుతోందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. మినిస్ట్రీ త్వరలో క్లినిక్‌ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్లినిక్ ద్వారా కువైట్‌లో వుండేవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి వైద్య చికిత్సను అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకో వైపున హెచ్‌ఐవీ పట్ల అవగాహన పెంచేందుకు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు మినిస్ట్రీ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఫర్ జనరల్ హెల్త్ మజ్దా అల్ ఖట్టాన్ చెప్పారు. 2021 నాటికి హెచ్‌ఐవీ కేసుల సంఖ్యను సగానికి తగ్గించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. మిడిల్ ఈస్ట్‌లో కువైట్, హెచ్‌ఐవీ ట్రీట్‌మెంట్ విభాగంలో అత్యున్నతస్థాయిలో పనిచేస్తోందని మినిస్ట్రీ పేర్కొంది. నేషనల్ క్యాంపెయిన్‌లో 81 శాతం హెచ్‌ఐవీ పాజిటివ్ పేషెంట్లను గుర్తించి, వారికి అవగాహన కల్పించడం జరిగింది. వారికి యాంటీరిట్రోవైరల్ డ్రగ్స్ అందించడం జరుగుతోంది. 90 శాతం మందిలో అన్ డిటెక్టబుల్ స్టేజ్‌లో వైరల్ లోడ్ ఉండడం గమనించదగ్గ అంశంగా మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!