దుబాయ్‌ సపారీ: రెండ్రోజుల్లో 14,00 మంది సందర్శకులు

- December 14, 2017 , by Maagulf
దుబాయ్‌ సపారీ: రెండ్రోజుల్లో 14,00 మంది సందర్శకులు

దుబాయ్‌ సఫారీ పార్క్‌ ప్రారంభమయ్యింది. కేవలం రెండ్రోజుల్లోనే 14,000 మంది సందర్శకులు దుబాయ్‌ సఫారీ పార్క్‌కి పోటెత్తారు. మొదటి రోజు 4,000 మంది సందర్శకులు దుబాయ్‌ సఫారీ పార్క్‌ని సందర్శించగా, రెండో రోజు ఏకంగా 10,000 మంది సందర్శించినట్లు అధికారులు చెప్పారు. ఫ్రీ ఎంట్రీ నేపథ్యంలో పార్క్‌కి పెద్దయెత్తున సందర్శకులు పోటెత్తుతున్నారు. పార్క్‌లో సౌకర్యాలు చాలా బాగున్నాయనీ, అత్యద్భుతమైన అనుభూతిని పార్క్‌ అందిస్తోందని సందర్శకులు తెలిపారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నామని దుబాయ్‌ మునిసిపాలిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ లీజర్‌ ఫెసిలిటీస్‌ ఖాలిద్‌ అల్‌ సువైది చెప్పారు. తొలి రెండు వారాలు పార్క్‌ సందర్శన ఉచితం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్క్‌ తెరిచి ఉంటుంది. అల్‌ వక్రా 5 డిస్ట్రిక్ట్‌లో ఈ పార్క్‌ ఏర్పాటయ్యింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com