అంజలి, రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రధారులుగా యదార్ధ సంఘటన ఆధారంగా సినిమా..
- December 15, 2017
గుంటూరు టాకీస్, రాజా మీరు కేక వంటి వినోదాత్మక చిత్రాలను, షూటింగ్ దశలో ఉన్న పవనిజం-2 వంటి చిత్రాలను తెరకెక్కించిన ఆర్‌కె స్టూడియోస్ బ్యానర్ పై ఎమ్. రాజ్‌కుమార్ గారు నిర్మాతగా, నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో.. గీతాంజలి, చిత్రాంగద వంటి చిత్రాలతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజలి, కాంచన సినిమాతో మాంచి ఫేమ్ సంపాదించిన రాయ్ లక్ష్మి ముఖ్య పాత్రల్లో త్వరలోనే ఒక సరికొత్త చిత్రం ప్రారంభం కానుంది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా, వినూత్నమైన సోషల్ ఎలిమెంట్స్ తో కూడిన కథతో, వినోదం మరియు ఉత్కంఠభరితమైన కథనంతో ఈ చిత్రం ఉండబోతుందని దర్శకనిర్మాతలు తెలియపరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
అంజలి, రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సాయి కుమార్, నరేష్, శివప్రసాద్, ధన్‌రాజ్, జాకీ, అశోక్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీః పి.జి విందా, ఎడిటింగ్ః తమ్మిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః దత్తి సురేష్ కుమార్, ప్రొడ్యూసర్ః ఎమ్. రాజ్‌కుమార్, కథ, కథనం, దర్శకత్వం: కర్రి బాలాజీ
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల