మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచిన జితేశ్ సింగ్ దేవ్

- December 15, 2017 , by Maagulf
మిస్టర్ ఇండియా టైటిల్ గెలిచిన జితేశ్ సింగ్ దేవ్

మిస్టర్ ఇండియా 2017 టైటిల్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన జితేశ్ సింగ్ దేవ్ గెలుచుకున్నాడు. ముంబైలోని బాంద్రా ఫోర్ట్‌లో గురువారం సాయంత్రం పీటర్ ఇంగ్లాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిస్టర్ ఇండియా 2017 పోటీల్లో 17 మంది పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన జితేశ్ సింగ్ దేవ్‌కు మిస్టర్ వరల్డ్ 2020 పోటీల్లో భారత్ తరఫున పాల్గొనే అవకాశం కలిగింది. అలాగే మిస్టర్ ఇండియా సూప్రనేషనల్‌గా ప్రతమేశ్ మౌలింకర్ నిలిచారు. సూప్రనేషనల్ 2018 పోటీల్లో ప్రతమేశ్ పాల్గొననున్నారు. ఈ పోటీల్లో అభి ఖాజురియా, పవన్ రావ్‌లు మొదటి, రెండో రన్నరప్‌లుగా నిలిచారు. 17 మంది పాల్గొన్న ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బహుమతులు అందజేశారు.గతేడాది మిస్టర్ వరల్డ్‌గా హైదరాబాద్‌కు చెందిన రోహిత్ ఖండ్వేలాల్ విజేతగా నిలిచి, భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. మిస్టర్ ఇండియా 2017గా నిలవడంపై జితేశ్ సంతోషం వ్యక్తం చేశాడు. అంతకు ముందు న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ. తనకు అవకాశం లభిస్తే 17 ఏళ్ల తర్వాత భారత్‌కు ప్రపంచ సుందరి కిరీటం తెచ్చిపెట్టిన మానుషీ చిల్లార్‌ మాదిరిగా దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తానని అన్నారు. ఈ పోటీల్లో నటి కంగనా రనౌత్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com