'మెంటల్ మదిలో' తర్వాత.. బ్రోచేవారెవరురా!

- December 15, 2017 , by Maagulf
'మెంటల్ మదిలో' తర్వాత.. బ్రోచేవారెవరురా!

'పెళ్ళిచూపులు' సినిమాతో నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించాడు రాజ్ కందుకూరి. ఈ సినిమా తర్వాత హడావుడి పడకుండా ఏడాది విరామం తీసుకుని 'మెంటల్ మదిలో' సినిమా మొదలుపెట్టాడు. వివేక్ ఆత్రేయ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం గత నెలలోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి రివ్యూలు.. పర్వాలేదనిపించే వసూళ్లు వచ్చాయి.

ఇప్పుడు ఇదే చిత్ర బృందం 'బ్రోచేవారెవరురా' అనే సినిమాతో రాబోతోంది. 'మెంటల్ మదిలో' సినిమా అనాలసిస్ మీట్లో ఈ విషయాన్ని నిర్మాత రాజ్ కందుకూరి వెల్లడించాడు. సురేష్ బాబు సమర్పణలో తాను ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తానని.. వివేక్ ఆత్రేయ నిర్మిస్తాడని తెలిపాడు. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ అని.. త్వరలోనే నటీనటులు.. సాంకేతిక నిపుణులు వివరాలు వెల్లడిస్తామని రాజ్ కందుకూరి చెప్పాడు.

ఇక 'మెంటల్ మదిలో' గురించి రాజ్ చెబుతూ.. ''ఈ సినిమా ఇప్పటికీ ఆదరణ పొందుతోంది. మంచి కంటెంట్ ఉంటే చిన్న పెద్ద తేడా లేకుండా ఏ సినిమానైనా ఆదరిస్తారనడానికి ఇది రుజువు. ఆ సెలబ్రేషన్లో భాగంగానే అనాలసిస్ మీట్ పెట్టాం. మా సినిమాపై ఎవరైనా తమ అభిప్రాయం చెప్పొచ్చు. మా బేనర్లో వివేక్ తో మరో సినిమా చేస్తున్నామంటేనే ఈ సినిమా ఎలాంటి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు'' అని అన్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com