మహేష్ బాబు కుటుంబంలో విషాదం
- December 15, 2017
ఈ మద్య టాలీవుడ్ లో వరుస విషాదాలు ఇండస్ట్రీ వర్గాన్ని శోకసంద్రంలో ముంచుతున్నాయి. ఈ మద్య అమ్మాయిలు-అబ్బాయిలు చిత్రంతో పరిచయం అయిన విజయ్ సాయి తర్వాత పలు చిత్రాల్లో మంచి కామెడీతో అలరించారు. మూడు రోజుల క్రితం విజయ్ తన ఫ్లాట్ లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదం మరువక ముందే..ప్రముఖ హీరో మహేష్ బాబు కుటుంభంలో విషాదం నెలకొంది.. ఘట్టమనేని కుటుంబానికి దగ్గరి బంధువు 'పద్మాలయ రాంబాబు'గా సుపరిచితులైన శాఖమూరి రాంబాబు మృతి చెందారు.
మహేష్ బాబుకి మామయ్య వరుస అయిన పద్మాలయ రాంబాబు అకాల మరణం చెందారు. మహేష్ బాబుకి కొన్నాళ్లపాటు పర్సనల్ మేనేజర్‌గా వ్యవహించిన ఆయన రమేష్ బాబుతో ఓ సినిమాని కూడా ప్రొడ్యూస్ చేశారు. పద్మాలయ స్టూడియోకి సంబంధించి వ్యవహరాలన్నింటిని చూసుకోవడంతో పాటు స్టూడియో సక్సెస్‌లో సగభాగం అయ్యారు అని తెలుస్తుంది.
రాంబాబు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తూ, కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఈ రోజు శాఖమూరి రాంబాబు అంత్యక్రియలు జరపనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల