ఇప్పుడు ఎంసిఏతో డబుల్ హ్యాట్రిక్
- December 15, 2017
ఈ ఏడాదిలో వరుసగా ఐదు హిట్ సినిమాలు అందించిన నిర్మాత దిల్ రాజు మరో విజయం కోసం సన్నద్దమవుతున్నారు. నాని, సాయిపల్లవి జంటగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో నిర్మించిన ఎంసిఏ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ నెల 21న సినిమాను విడుదల చేస్తున్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ మా సంస్థలో ఈ ఏడాది శతమానంభవతి, నేను లోకల్, దువ్వాడ జగన్నాథమ్, ఫిదా, రాజా ది గ్రేట్ చిత్రాలతో వరుసగా ఐదు సూపర్‌హిట్ సినిమాలు అందించాం. ఇప్పుడు ఎంసిఏతో డబుల్ హ్యాట్రిక్‌కు సిద్ధమయ్యాం. ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధిస్తామనే నమ్మకం ఉంది. డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వ ప్రతిభ అద్భుతంగా ఉంది. యూనిట్ అంతా సంతోషంగా ఉన్నాం. ముఖ్యంగా నాని, సాయిపల్లవిలకు ఈ సినిమాతో మరో హిట్ రావడం గ్యారంటీ.
అలాగే భూమిక ఇందులో వదిన పాత్రలో నటించారు. చాలా గ్యాప్ తర్వాత భూమిక తెలుగులో చేస్తున్న సినిమా ఇది. వదిన, మరిది మధ్య అనుబంధంపై కథనం ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. అంచనాలకు చేరుకునేలా వినోదాత్మక చిత్రమిది. సమీర్ రెడ్డి విజువల్స్ మరో ఆకర్షణ అని చెప్పారు. ఎంసిఏ ప్రీ రిలీజ్ వేడుకను శనివారం హన్మకొండలో నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా రాజీవ్ కనకాల, నరేష్, ఆమని నటిస్తున్నారు. మాటలు మామిడాల తిరుపతి, శ్రీకాంత్ విస్సా, నిర్మాణం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల