జనవరి 12న జై సింహ రిలీజ్
- December 15, 2017
బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జైసింహా. నయనతార, నటాషా జోషీ, హరిప్రియ నాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సి. కళ్యాణ్ నిర్మాత. ఇటీవల పాటల చిత్రీకరణతో జైసింహా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.దుబాయ్లో రెండు పాటల చిత్రీకరణతో జైసింహా షూటింగ్ మొత్తం పూర్తయింది. బాలకృష్ణ, నయనతార, నటాషా జోషీలపై ఈ పాటలను రూపకల్పన చేశాం. జానీ, బృంద మాస్టర్ల నేతృత్వంలో యురోపియన్ డాన్సర్లతో తెరకెక్కించిన ఈ పాటలు జైసింహాలో ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. చిరంతన్ భట్ మంచి సంగీతాన్ని అందిం చారు. డిసెంబర్ నెలాఖరకు పాటల విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ముందు నిర్ణయించినట్లు జనవరి 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







