ఇకపై విశాఖ విమానాశ్రయంలోనూ విదేశీయులకు 'వీసా ఆన్ అరైవల్'
- December 15, 2017
అమరావతి: విదేశీయులు ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే ఇక మీదట వీసా ముందే తీసుకుని రావాల్సిన అవసరం ఉండదు. 'వీసా ఆన్ అరైవల్' కోసం ఆన్లైన్లో ముందుగా దరఖాస్తు చేసుకుని వచ్చేయవచ్చు. విశాఖపట్నం విమానాశ్రయంలో దిగాక అక్కడికక్కడే వీసా పొందవచ్చు. ఇందుకు వీలుకల్పిస్తూ... విశాఖపట్నంలో 'వీసా ఆన్ అరైవల్' జారీ చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి సమాచారమందింది. ఇది వెంటనే అమల్లోకొస్తుందని, సంబంధిత అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇకమీదట 147 దేశాల నుంచి విదేశీ పర్యాటకులు వీసా లేకుండానే నేరుగా విశాఖకు వచ్చి, వీసా తీసుకుని రాష్ట్రమంతా పర్యటించవచ్చని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సౌకర్యం 17 విమానాశ్రయాల్లోనే ఉండగా ఇప్పుడు విశాఖను అందులో చేర్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







