పొడుగుకాళ్ల సుందరిగా రికార్డు సాధించిన ఎకతెరీనా లిసినా
- December 16, 2017లాంగెస్ట్ లెగ్స్ బ్యూటీగా రష్యాకు చెందిన ఎకతెరీనా లిసినా గిన్నిస్ రికార్డు కొట్టేసింది. ఈమె పొడవు 6 అడుగుల 8 అంగుళాలకు పైగా ఉంటే.. లిసినా కాళ్లే నాలుగడుగులకు పైగా పొడవుండడం విశేషం. ఈమె కుడికాలు కంటే ఎడమకాలు కాస్త పొడవుగా ఉంది. పొడుగుకాళ్ల సుందరిగా రికార్డు సాధించడంతో లిసినా సంబరపడిపోతోంది. పొడవుకాళ్లున్న అమ్మాయిలు చాలా అందంగా కూడా ఉంటారని చెబుతోంది లిసినా. కాళ్లు పొడుగ్గా ఉండడం వల్ల మిగతా వాళ్లకంటే వేగంగా కూడా నడవచ్చని జోక్ చేస్తోంది. అబ్బాయిలు కూడా పొడవు కాళ్ల సుందరిలంటే పడిచస్తారని చెబుతోంది లిసినా. ఈ పొడుగుకాళ్ల సుందరి రోడ్డుపై కనిపిస్తే చాలు అందరూ ఆమెతో పొటోలు దిగేందుకు సరదా పడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో ఇక మోడల్ కావాలన్న తన డ్రీమ్ నిజం చేసుకునేందుకు సిద్ధమైంది ఈ లాంగెస్ట్ లెగ్స్ బ్యూటీ. కానీ పొడుగ్గా ఉండడం వల్ల కష్టాలు కూడా ఉన్నాయంటోంది లిసినా. సరిపోయే బట్టలు దొరకడం లేదని చెబుతోంది. కార్లో కూర్చోవాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా, టెలిఫోన్ బూత్‌లో నిలబడాలన్నా కష్టంగా ఉందని అంటోంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం