జీహెచ్ఎంసీకి ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు
- December 16, 2017
విద్యుత్ ఆదా.. నిర్వహణ సంస్కరణలను అమలు చేస్తోన్న జీహెచ్ఎంసీ ఎనర్జీ కన్జర్వెషన్ - 2017 అవార్డుకు ఎంపికైంది. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ గ్రేటర్‌కు అవార్డును అందజేయనుంది. 2014-15 నుంచి 2016-17 వరకు విద్యుత్ పొదుపు చేసేందుకు జీహెచ్ఎంసీ మెరుగైన విధానాలను అమలులోకి తీసుకువచ్చింది. 32.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపుతో సంస్థకు రూ.23.11 కోట్లు ఆదా అయింది. స్ర్టీట్ లైట్లు వెలగకుండా నిర్ణీత సమయంలో మాత్రమే ఆన్ అయ్యేలా ఆటోమేటిక్ స్విచ్‌లు ఏర్పాటు ప్రారంభించారు. 25వేల స్విచ్‌లను ఆన్/ఆఫ్ చేయడానికి కాలనీ సంఘాల సహకారంతో ఎనర్జీ వాలంటీర్లను నియమించారు. చిన్న, చిన్న చౌరస్తాల్లో ఉన్న హై ఓల్టేజీ లైట్ల సామర్ధ్యాన్ని తగ్గించారు. నగరంలో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు ప్రాజెక్టు 55 శాతానికి పైగా పూర్తయిందని కమిషనర్ డాక్టర్ బీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల