ఫిబ్రవరి 9న రానున్న 'కణం'
- December 16, 2017
సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్‌తో '2.0' చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ విజయ్ దర్శకత్వంలో నాగశౌర్య, సాయిపల్లవి జంటగా విభిన్నమైన కథతో 'కణం' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ''షూటింగ్ పూర్తయింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అని లైకా ప్రొడక్షన్స్‌వారు తెలిపారు.
హీరో నాగశౌర్య మాట్లాడుతూ - ''లైకా ప్రొడక్షన్స్ వంటి పెద్ద బేనర్లో సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. చాలా డిఫరెంట్‌గా వుండే సబ్జెక్ట్ ఇది. విజయ్ చాలా ఎక్స్ట్రార్డినరీగా తీశారు'' అన్నారు. హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ ''ఫిదా తర్వాత చేస్తున్న మరో మంచి సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది'' అన్నారు.
నాగశౌర్య, సాయిపల్లవి, ప్రియదర్శి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నిరవ్‌షా, శ్యామ్ సి.ఎస్., ఎల్.జయశ్రీ, స్టంట్ సిల్వ, ఆంటోని, విజయ్, సత్య, పట్టణం రషీద్, ఎం.ఆర్.రాజకృష్ణన్, కె.మణివర్మ, రామసుబ్బు, సప్న షా, వినయదేవ్, మోడేపల్లి రమణ, కె.భార్గవి, ప్రత్యూష, ఎస్.ఎం.రాజ్‌కుమార్, ఎస్.శివశరవణన్, షియామ్ పనిచేస్తున్న సాంకేతికవర్గం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.ప్రేమ్, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్, దర్శకత్వం: విజయ్.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల