బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్లో సింధు ఓటమి
- December 17, 2017
బ్యాడ్మింటన్‌లో మరో టైటిల్ ముద్దాడాలన్న తెలుగుతేజం పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఉత్కంఠగా సాగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ సూపర్ సిరీస్ మహిళల సింగిల్స్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి యమగూచి చేతిలో ఓటమి పాలయ్యింది. 94 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 21-15, 12-21, 19-21 తేడాతో సింధు పోరాడి ఓడింది. సింధు-యమగూచి మధ్య జరిగిన ఫైనల్ పోరు హోరాహోరీగా సాగింది. 21-15తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది సింధు. అయితే, రెండో గేమ్‌ను 12-21తో ప్రత్యర్థి కైవసం చేసుకుని సింధుకు సవాల్ విసిరింది. దీంతో టైటిల్ గెలవాలంటే మూడో గేమ్‌లో గెలుపు తప్పనిసరి. అందరి దృష్టి మూడో గేమ్‌పైనే. అందుకు తగ్గట్టుగానే చివరి వరకు పోరు హోరాహోరీగా సాగింది. స్కోరు 19-19 వచ్చే వరకు స్కోర్లు చాలా దగ్గరగా వచ్చాయి. చివర్లో ఒత్తిడిని జయిస్తూ యమగూచి వరుసగా రెండు పాయింట్లు సాధించడంతో విజయం ఆమెను వరించింది. దీంతో సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతేడాదే తొలిసారిగా బీడబ్ల్యూఎఫ్ సిరీస్‌లో అడుగిడిన సింధు. అప్పట్లో సెమీస్ దశను దాటలేకపోయింది. ఈ సారి ఆ దశను దాటినప్పటికీ కీలకమైన టైటిల్ పోరులో వెనకబడిపోయింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల