వెబ్ సైట్ లకు గూగుల్ హెచ్చరిక.!
- December 17, 2017
ఇటీవల కాలంలో కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న అసత్య వార్తలకు(ఫేక్ న్యూస్) అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ సెర్చింజన్ గూగుల్ చర్యలు ప్రారంభించింది. నెటిజన్లను తప్పుదోవ పట్టించే అలాంటి వెబ్‌సైట్లపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. ఫేక్ న్యూస్ అందించే వెబ్‌సైట్లను న్యూస్ వెబ్‌సైట్ల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిపింది. వెబ్‌సైట్‌కు సంబంధించిన యజమాని వివరాలు, దేశం, నెటిజన్లను తప్పుదోవ పట్టించడం ఇలా ఏ చర్యకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందుకోసం సరికొత్త మార్గదర్శకాలను రూపొందించినట్లు పేర్కొంది. నెటిజన్లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా సౌకర్యవంతంగా చదువుకునేలా వార్తలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గూగుల్ తెలిపింది. 'మీకోసం మిమ్మల్ని మీరు తప్పుగా చూపించుకోవద్దు. వెబ్‌సైట్‌లు గూగుల్ న్యూస్‌తో సహా ఎవర్నీ తప్పుగా చూపించవద్దు. తప్పులు, యాజమాని వివరాలు గోప్యంగా ఉంచడం, నెటిజన్లను తప్పుదోవ పట్టించేలా చేయటం, ఒక దేశంలో ఉండి మరో దేశంలో ఉన్నట్లు కంప్యూటర్ ఐపీలను చూపించటం ఇక సహించం' అని గూగుల్ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల