దుబాయ్ లో పర్మిషన్ రానందున 'సాహో' షెడ్యూల్లో మార్పు
- December 17, 2017
ప్రభాస్ , శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం సాహో. తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కొద్దీ రోజులుగా ఆగిపోయింది. హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ , నెక్స్ట్ షెడ్యూల్ దుబాయ్ లో ప్లాన్ చేసారు.
బుర్జ్ ఖలీఫా టవర్, రస్-అల్-ఖమా వరల్డ్ ట్రేడ్ సెంటర్, అబుదాబిలోని ఇతిహాద్ టవర్ తో పాటు దుబాయ్ శివార్లలోని భారీ ఎడారి, కొండల మధ్య ఛేజింగ్ సన్నివేశాలు వంటివి తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం అక్కడ షూటింగ్ కు ఇంకా అనుమతి రాలేదట. దీంతో ఇంకా వెయిట్ చేస్తే నటి నటుల కాల్ షీట్స్ వెస్ట్ అవుతాయని భావించిన చిత్ర యూనిట్ , హైదరాబాద్ లో చిన్నపాటి షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారట. ఈ షెడ్యూల్ పూర్తికాగానే సుమారు రెండున్న నెలల భారీ షెడ్యూల్ కోసం టీమ్ దుబాయ్ వెళుతుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల