కన్నీటి పర్యంతమైన పీవీ సిం
- December 17, 2017
భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు కల మరోసారి చెదిరింది. చరిత్రకు అడుగుదూరంలో నిలిచిపోయింది. వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో పోరాడి ఓడింది.. రజత పతకంతో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్ పోరులో సింధు 21-15, 12-21, 19-21తో జపాన్ ప్లేయర్ యమగుచి చేతిలో ఓటమిపాలైంది. ఫైనల్ మ్యాచ్‌లో సింధుకి ఓటమి ఇది తొలిసారి కాదు. గత ఏడాది రియో ఒలింపిక్స్ ఫైనల్లో పరాజయం పాలైన సింధు, ఈ ఏడాదిఆగస్టులో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ టైటిల్ పోరులో ఓడిపోయింది. తాజాగా సూపర్ సిరీస్ ఫైనల్‌లో మరోసారి అదే ఫలితం ఎదురైంది. దాదాపు గంటన్నరపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో మొదట్లో సింధు ఆధిక్యం కనబరిచినా, చివరి వరకు అదే జోరును కొనసాగించలేకపోయింది. రెండో సెట్‌ను యమగుచి గెలుచుకోగా.. కీలకమైన మూడో సెట్ హోరాహోరీగా సాగింది.. అయితే ఊహించని రీతిలో పుంజుకున్న యమగుచి టైటిల్‌ను తన్నుకుపోయింది. ఆఖరి నిమిషంలో పరాజయం పాలవడంతో సింధు కన్నీటి పర్యంతమైంది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







