40 రోజుల్లో సినిమా పూర్తి చేసిన హీరో

- December 18, 2017 , by Maagulf
40 రోజుల్లో సినిమా పూర్తి చేసిన హీరో

అందాల రాక్షసి చిత్రం తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్..ఆ తర్వాత అలా ఎలా, శ్రీమంతుడు, టైగర్ సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా దర్శకుడిగా మారి హీరో సుశాంత్ తో 'చి. ల.సౌ' అనే సినిమాను తెరకెక్కించాడు. కేవలం ఈ సినిమాను 40 రోజుల్లో పూర్తి వార్తల్లో నిలిచాడు. ఈ సినిమా ద్వారా రుహని అనే అమ్మాయి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. 'మెంటల్ మదిలో' సినిమాకు సంగీతం అందించిన ప్రశాంత్ విహారి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

ప్రేమకథ నేపథ్యం లో ఈ మూవీ ని రూపొందించాడట. సినిమా మొదలైనప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి తక్కువ టైం లో చిత్రీకరణ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ప్రీ లుక్ కు మంచి స్పందన రావడం తో సినిమా ఖచ్చితంగా విజయం సాదిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. నటుడి గా గుర్తింపు సాధించిన రాహుల్ , డైరెక్టర్ గా ఏ మ్రాకు విజయం అందుకుంటాడో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com