ఫ్లై ఓవర్‌ తాత్కాలికంగా మూసివేత

- December 18, 2017 , by Maagulf
ఫ్లై ఓవర్‌ తాత్కాలికంగా మూసివేత

మస్కట్‌: బైట్‌ అల్‌ ఫలాజ్‌ ఫ్లై ఓవర్‌పై ట్రాఫిక్‌ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు మస్కట్‌ మునిసిపాలిటీ పేర్కొంది. వాడి కబిర్‌ మరియు అల్‌ బుస్తామన్‌ మధ్య ఈ ఫ్లై ఓవర్‌ని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. డిసెంబర్‌ 17 నుంచి 28 వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేస్తారు. మెయిన్‌టెనెన్స్‌ వర్క్‌లో భాగంగా ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. వాహనదారులు, ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించవలసి ఉంటుందని అధికారులు చెప్పారు. ఖుర్రమ్‌ హైట్స్‌ రోడ్‌ కూడా రాత్రి వేళల్లో మూసివేశారు. బ్రిడ్జి మెయిన్‌టెనెన్స్‌ పనుల కోసం ఈ బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com