గ్యాంబ్లింగ్: మనామాలో 12 మంది వలసదారుల అరెస్ట్
- December 18, 2017
మస్కట్: 13 మంది వలసదారుల్ని రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాంబ్లింగ్‌కి పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వీరిని సలాలాలో అరెస్ట్ చేయడం జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. దోఫార్ పోలీస్ నేతృత్వంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇంక్వైరీస్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఆసియాకి చెందిన 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఓ రెంటెడ్ అపార్ట్‌మెంట్‌లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లుగా అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన విచారణ బృందం వ్యూహాత్మకంగా నిందితుల్ని అరెస్ట్ చేసింది. ఈ సందర్బంగా వారి నుంచి పెద్ద మొత్తంలో నగదుని కూడా స్వాదీనం చేసుకున్నారు. గ్యాంబ్లింగ్‌కి పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపేందుకు కఠినమైన చట్టాలున్నాయి. ఆరు నెలల నుంచి మూడేళ్ళ దాకా జైలు శిక్ష, 500 ఒమన్ రియాల్స్ వరకూ జరీమానా దోషులకు పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







