గల్ఫ్ లో సత్యనారాయణ వ్రతం చేసిన పలువురు భారతీయులకి శిక్ష
- November 17, 2015
సత్యనారాయణ వ్రతం చేసినందుకు 9 మంది గల్ఫ్ బహిష్కరణ శ్లోకాలు చదివి ఇతరులకు ఇబ్బంది కలిగించారని కేసు అనుమతి లేకుండా సత్యనారాయణ వ్రతం చేసి, గట్టిగా శ్లోకాలను చదివి ఇతరులకు ఇబ్బంది కల్గించారనే అభియోగంపై తొమ్మిది మంది భారతీయులు దేశ బహిష్కరణకు గురయ్యారు. కువైట్లో వివిధ హోదాలలో పని చేస్తున్న కర్ణాటక రాష్ట్రంలోని మంగళూర్, ఉడిపి ప్రాంతాలకు చెందిన ప్రవాసీయులు భారతీయ ఎంబసీ అనుమతితో ఒక ప్రవాసీ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘం ఆధ్వర్యంలో దశాబ్ద కాలంగా సత్యనారాయణ వ్రతం సహా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వ్రతం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారంతా గట్టిగా శ్లోకాలను చదవడంతో తమకు ఇబ్బంది కలిగిదంటూ చుట్టుపక్కల ఉన్న అరబ్బులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పూజా కార్యక్రమంతో సంబంధం ఉన్న 11 మందిని అరెస్ట్ చేశారు. నెలరోజుల పాటు కస్టడీలో ఉంచారు. తర్వాత వారిలో 9 మంది వీసాలను రద్దు చేసి కువైట్ నుంచి బహిష్కరించారు. అంతేకాదు వీరు తమ జీవిత కాలంలో ఏ గల్ఫ్ దేశంలోనూ ప్రవేశించకుండా నిషేధం విధించారు. వీరిపై దేశ బహిష్కరణ శిక్ష విధించకుండా భారతీయ ఎంబసీ, సహా కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి అనంతకుమార్, ఇతర నేతలు ప్రయత్నించినా కువైట్ పోలీసులు ఒప్పుకోలేదని తెలిసింది. ఇదే కారణంతో గత ఏడాది సౌదీ అరేబియాలోనూ కర్ణాటక, కేరళ రాష్ర్టాలకు చెందిన క్రైస్తవులపై కఠిన చర్యలు తీసుకొన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









