ముంబయిలో ఘోరం..12 మంది సజీవ దహనం
- December 18, 2017
ముంబయిలో సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఓ మిఠాయి దుకాణంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 12 మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మంది గాయాలతో బయటపడ్డారు. విద్యుదాఘాతం కారణంగా స్విచ్‌బోర్డు నుంచి ప్రారంభమైన మంటలు ఎల్పీజీ సిలిండర్‌ను చేరుకోవడంతో అది పేలిపోయి ఉండవచ్చని ప్రాథమిక ఆధారాలను బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. అది పేలిన ధాటికి దుకాణం భవనం కుప్పకూలింది. ఈలోపే అగ్నికీలలకు భయపడి తొమ్మిది మంది పరుగులు పెట్టి తప్పించుకోగలిగారు. అంధేరి సాకినాకాలోని ఘాట్కోపర్ ఖైరానీ రోడ్డులోని ఒక భవనంలోని పైఅంతస్తులో భానుమిఠాయి దుకాణం ఉంది. సోమవారం తెల్లవారుజామున ఆ భవనంలో అకస్మాతుగా అగ్గి రాజుకుంది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో నిద్రిస్తున్న 12 మంది సిబ్బంది అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకునేందకు పై అంతస్తుకు పరుగులు తీశారు. అప్పటికే పై అంతస్తులో మంటలు వ్యాపించి ఉన్నాయి.
బయటపడేందుకు మార్గం లేక 12మంది సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. కార్మికుల మృతదేహాలను ఘాట్కోపర్ రాజవాడి ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సాకినాక పోలీసు ఠాణా సీఐ అవినాశ్ ధర్మాధికారి తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







