కాలుష్య కారకులే నష్టాన్ని భర్తీ చేయాలి: చైనా
- December 18, 2017
బీజింగ్ : పర్యావరణానికి నష్టం కలిగించేవారే ఆ నష్టాన్ని భర్తీ చేసేలా లేదా నష్టపరిహారం చెల్లించే విధంగా 2020 నాటికి దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థను ప్రవేశపెట్టాలని చైనా యోచిస్తోంది. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. పర్యావరణాన్ని కలుషితం చేసేవారిపై ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యల్లో భాగమే ఇది. వచ్చే మూడేళ్ళ కాలంలో పర్యావరణ పరిరక్షణకు సమగ్ర వ్యవస్థను నెలకొల్పాలన్నది చైనా లక్ష్యంగా వుంది. పర్యావరణానికి ఎవరివల్ల నష్టం జరుగుతుందో వారే పరిహారం చెల్లించేలా చూడనున్నట్లు చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ కార్యాలయాలు విడుదల చేసిన పత్రం ఆదివారం పేర్కొంది. పర్యావరణానికి ఏ విధంగానైనా నష్టం కలిగించే వ్యక్తులు లేదా సంస్థలే తిరిగి పర్యావరణాన్ని శుద్దిచేసే బాధ్యత కూడా చేపట్టాలని లేదా నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంటోంది. అయితే ఆ నష్టపరిహారం ఎంత అనేది వివరాలేమీ ఆ పత్రంలో వెల్లడించలేదు. భూమి, నీరు, గాలి కాలుష్యాల పర్యవేక్షణను మరింత కట్టుదిట్టంగా చూసేందుకు ఈ పెనాల్టీలు ఉద్దేశించబడ్డాయి. పెద్ద ఎత్తున జరిగే ప్రమాదాల తర్వాత తిరిగి పర్యావరణ పరంగా సమతుల్యతను పునరుద్ధరించడానికి, అందుకయ్యే వ్యయానికి ఆయా కంపెనీలే జవాబుదారీ వహించాల్సి వుంటుంది. ఫ్యాక్టరీలు, కంపెనీలు పెద్ద మొత్తంలో విషతుల్యమైనటువంటి రసాయనాలను నదుల్లో కలిపేస్తున్నాయని, దాంతో పెద్ద సంఖ్యలో చేపలు చనిపోతున్న సంఘటనలు ఇటీవల కాలంలో అనేకం జరుగుతున్నాయి.
తీర ప్రాంత పర్యావరణాన్ని దెబ్బతీసే చమురు కంపెనీలకు కూడా భారీగా పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం విడిగా ఒక ప్రణాళికను రూపొందించే ఆలోచన చేస్తోంది. కాలుష్యంపై తన పోరాటాన్ని ప్రభుత్వం ఉధృతం చేసింది. కొన్ని ఫ్యాక్టరీలను మూసివేయించింది. తనిఖీలు, పరిశోధనలు జరిపిన తర్వాత కొంతమంది అధికారులను జవాబుదారీగా ప్రకటించింది. ఉత్తర చైనాలో ఈ శీతాకాలంలో లక్షలాది కుటుంబాలు, వేలాదిమంది వ్యాపారవేత్తలు బొగ్గు నుండి సహజవాయువుకు మళ్ళేందుకు ప్రభుత్వం అనూహ్యమైన రీతిలో ప్రచారం చేపట్టింది.
తాజా వార్తలు
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం