వనిత రిలీజ్ చేసిన ఫోటోలపై క్లారిటీ ఇచ్చిన విజయ్ తండ్రి
- December 19, 2017
టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి ఆత్మహత్య కేసు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో నిజజీవిత సినిమాను తలపిస్తుంది. తన ఆత్మహత్యకు తన భార్య విజయ్.. శశిధర్ ఆమె లాయర్ కారణం అనే సెల్ఫీ వీడియో లో విజయ్ ప్రకటించి సంచలనం సృష్టించాడు.. విజయ్ తండ్రి సుబ్బారావు తన కుమారుడు ఆత్మహత్యకు కారణం తమ కోడలు వేధింపులే అని పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు చేసుకొన్న పోలీసుల దర్యాప్తులో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. వనిత కి రెండు పేర్లు.. ఇద్దరు తండ్రులు వంటి అనేక షాకింగ్ నిజాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.. ఈ నేపథ్యంలో వనిత తన భర్త విజయ్ కు ఓ అమ్మాయితో సంబంధం ఉందని ఆరోపిస్తూ.. ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను మీడియాకు విడుదల చేసింది. మరి కొన్ని వీడియోలు.. ఫోటోలతో లొంగి పోతానని.. వనిత సెల్ఫీ వీడియో ద్వారా ప్రకటించింది.. కాగా మీడియాకు విడుదల చేసిన ఫోటోలపై విజయ్ తండ్రి సుబ్బారావు స్పందిస్తూ.. షాకింగ్ నిజాలను బయట పెట్టారు..
వనిత మీడియాకు రిలీజ్ చేసిన ఫోటోలు ఇప్పటివి కావని.. అవి సుమారు నాలుగేళ్ల క్రితం ఫోటోలు అని చెప్పారు.. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఒక మోడల్.. ఆ అమ్మాయితో కలిసి విజయ్ ఎయిడ్స్ అవర్ నెస్ యాడ్ లో నటించాడు.. ఆ ఫోటోలు అప్పటివి అని క్లారిటీ ఇచ్చాడు.. ఆ ఫోటోలో అమ్మాయితో విజయ్ కు ఎటువంటి సంబంధం లేదు.. అదంతా నటనలో భాగంగా తీసిన ఫోటోలే.. అని ఆయన చెప్పారు. ఈ ఫోటోలనే ఆయుధం గా చేసుకొని మమ్మల్ని బ్లాక్ మైల్ చేయాలని చూస్తుంది అని విజయ్ తండ్రి చెప్పారు. డబ్బుకోసమే ఆమె ఇదంతా చేస్తుంది.. ఇప్పటికే డబ్బు, నగలు, కారు అన్నీ తీసుకొని వెళ్లింది.. అని విజయ్ తండ్రి సుబ్బారావు తెలిపారు. పోలీసులు మరింత లోతుగా విచారిస్తే.. ఆమె గురించి అసలు నిజాలు బయట పడతాయని ఆయన చెప్పారు.. కాగా వనిత సెల్ఫీ ఆధారంగా ఆమె కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.. అరెస్ట్ కు రంగం సిధ్ధం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల