ఫుట్‌బాల్ కు కాకా బైబై
- December 20, 2017
బెజిల్: బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు కాకా ఆటకు బైబై చెప్పాడు. 2002 ఫిపా ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడైన కాకా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తాను ప్లేయర్‌గా మాత్రమే రిటైర్ అవుతున్నానని, ఫుట్‌బాల్ క్రీడకు దగ్గరగానే ఉంటానని స్పష్టం చేశాడు. క్లబ్ మేనేజర్, స్పోర్టింగ్ డైరెక్టర్ వంటి పాత్రలు పోషించేందుకు సిద్ధంగా ఉంటానన్నాడు. 35 ఏళ్ల కాకా పూర్తి పేరు రికార్డో ఎక్జెలన్స్ డాస్ సాంతోస్ లిటీ. ఫుట్‌బాల్ వర్గాల్లో మాత్రం కాకా పేరుతో ప్రసిద్ధి. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాలర్ ఇచ్చే ప్రతిష్టాత్మక బ్యాలన్ డి ఓర్ పురస్కారానికి 2007లో అందుకున్నాడు. కెరీర్‌లో మిలాన్, రియల్ మాడ్రిడ్ క్లబ్‌లకు ఆడాడు. బ్రెజిల్ తరుపున 92 మ్యాచ్‌లు ఆడి 29 గోల్స్ చేశాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల