'ఎంసీఏ' పూర్తయ్యేసరికి భూమిక తనకు వదినగా మారిపోయిందంటున్న నాని

- December 20, 2017 , by Maagulf
'ఎంసీఏ' పూర్తయ్యేసరికి భూమిక తనకు వదినగా మారిపోయిందంటున్న నాని

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎదగటం కష్టమన్న చాలామంది నోటి నుంచి వినిపిస్తుంది. అయితే.. అలాంటి మాటలు అస్సలు నమ్మకండి. మీలో విషయం ఉంటే మిమ్మల్ని.. మీ టాలెంట్‌ను అడ్డుకునేవాడే ఉండరన్న విషయాన్ని ఫ్రూవ్ చేసిన వ్యక్తి నాని.

పక్కింటి కుర్రాడిలా కనిపించే నాని.. ఎలా ఎదిగాడో అందరికి తెలిసిందే. సొంత టాలెంట్ తో పాటు.. హార్డ్ వర్క్ తో ఎదిగిన అతగాడు సినిమా సినిమాకు తన రేంజ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. తాజాగా మరో కొత్త సినిమాతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఒక అన్నయ్య.. వదిన.. మరిదిల మధ్య సాగే చిత్రంగా చెబుతూ.. ఎంసీఏ అన్న వెరైటీ టైటిల్‌తో ప్రేక్షకులకు పలుకరించేందుకు వచ్చేస్తున్నాడు.
 
ఎంసీఏ అన్న దానికి అర్థం మిడిల్ క్లాస్ అబ్బాయి అంటూ కొత్త అర్థం చెబుతూ.. పేరులోనే కొత్తదనాన్ని ప్రదర్శించిన ఈ చిత్రం విడుదల తర్వాత ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈచిత్ర విడుదల నేపథ్యంలో..మీడియాతో మాట్లాడిన సందర్భంగా కొన్ని ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చారు.
 
మిగిలిన ముచ్చట్లు ఎప్పటి మాదిరే మామూలే అయినా.. ఎప్పుడు చెప్పని కొత్త విషయాలు ఈసారి నాని నోటి నుంచి వచ్చాయి. అందులో.. ఎంసీఎ చిత్రంలో తనకు వదినగా నటించిన భూమిక గురించి ఆసక్తికర అంశాల్ని చెప్పాడు. భూమిక తనకు వదినగా నటిస్తుందన్న విషయం చెప్పిన వెంటనే తాను చాలా ఎగ్జైట్ అయినట్లు వెల్లడించాడు. ఎందుకంటే.. ఖుషి సినిమా టికెట్ల కోసం మామూలు క్యూ లైన్ కాకుండా.. సపరేట్ క్యూలో నిలుచున్నందుకు పోలీసులు తనను చితక్కొట్టారని.. ఆ విషయాన్ని భూమికకు చెబితే తెగ నవ్వేసినట్లు చెప్పాడు.
 
ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే నాటికి భూమిక తనకు వదినగా మారిపోయిందన్నారు. వాళ్ల అబ్బాయి కోసం షాపింగ్ చేసేటప్పుడు తన కొడుక్కి బొమ్మలు కొని తెచ్చేవారని చెప్పారు. ఇక.. ఈ మధ్యన సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న గాసిప్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు నాని. సాయి పల్లవితో తనకు గొడవ అంటూ ఇష్టం వచ్చినట్లుగా రాశారని.. ఆ వార్తల్ని చదువుకొని తామిద్దరం నవ్వుకున్నట్లు చెప్పారు. తాజా మూవీలో సాయిపల్లవి క్యారెక్టర్‌ను వేరే వారితో ఊహించుకోలేమని చెప్పిన నాని.. ఇటీవల వెబ్ సైట్లలో తన మీద వస్తున్న రూమర్‌కు మాత్రం బాధ పడుతున్నట్లు చెప్పారు. వ్యూయర్స్ ను పెంచుకోవటం కోసం కొన్ని వెబ్ సైట్లు ఇష్టం వచ్చినట్లు రాయటాన్ని నాని తప్పు పట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com