చంద్రన్న క్రిస్మస్ కానుకలు

- December 20, 2017 , by Maagulf
చంద్రన్న క్రిస్మస్ కానుకలు

పేదవాడు పండుగలను ఆనందంగా జరుపుకునేందుకు చంద్రన్న ప్రత్యేక కానుకలను అందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. విజయవాడ మొగల్రాజపురం కస్తూరిబాయిపేటలో బుధవారం చంద్రన్న క్రిస్మస్‌, సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతంతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్తిపాటి మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని చౌకధర దుకాణాల్లోనూ పంచదారను కార్డుదారులకు అందించనున్నామని తెలిపారు.

చంద్రన్న క్రిస్మస్‌ కానుకగా కిలో గోధుమ పిండి, పామాయిల్‌, కందిపప్పు, పచ్చి శనగపప్పు, బెల్లం అర కిలో, నెయ్యి 100 గ్రాములు ఉచితంగా అందిస్తున్నామన్నారు. దేవినేని ఉమా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా పేదలకు చంద్రన్న కానుకలు ఇస్తున్నట్లు తెలిపారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కలెక్టర్‌ లక్ష్మీకాంతం మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 3.20 లక్షలకు పైగా చంద్రన్న క్రిస్మస్‌ కానుకలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com