బానిసత్వంలో 90మంది భారతీయులు

- December 20, 2017 , by Maagulf
బానిసత్వంలో 90మంది భారతీయులు

లండన్‌ : బ్రిటన్‌లో 90మంది భారతీయులు బానిసత్వంలో మగ్గిపోతున్నారని నేషనల్‌ ఆడిట్‌ ఆఫిస్‌ (ఎన్‌ఏఓ) అధికారులు వెల్లడించారు. డొమెస్టిక్‌ వర్కర్స్‌ వీసాలపై భారత్‌ నుంచి బ్రిటన్‌కు వచ్చిన పౌరుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. బానిసత్వం కోరల్లో భారతీయులు చిక్కుకొని ఇబ్బందులుపడుతున్నారని అన్నారు. చాలీచాలని వేతనాలతో బ్రిటన్‌లోని భారతీయులు ఇబ్బందులు పడుతున్నారని, బానిసత్వం శృంఖలాల్లో బందీలైపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో 8దేశాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఎన్‌ఏఓ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. అయితే, వారిలో భారతీయులే ఎక్కువగా కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. బ్రిటన్‌లో బానిసత్వ ఛాయలు అలుముకునే పరిస్థితులు నెలకొనే ప్రమాదముందని ఈ సంస్థ 2014లోనే ప్రకటించింది. 10 నుంచి 13వేల మంది బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్నారని అప్పట్లోనే తెలిపింది. బానిసత్వాన్ని నిర్మూలించేందుకు బ్రిటన్‌ ప్రథాని థెరిసా మే కృషి చేయాలని ఆ సంస్థ డిమాండ్‌ చేసింది. కేవలం 90 మంది భారతీయులకు సంబంధించిన సమాచారం, వివరాలు మాత్రమే అందాయని, బాధితుల సంఖ్య వేలల్లో ఉంటుందని అనుమానిస్తున్నామని పేర్కొన్నది.

కాగా, 2015లో జార్ఖండ్‌ నుంచి బ్రిటన్‌లో పని కోసం వచ్చిన పర్మిలా టిర్కీ అనే మహిళ స్థానిక కోర్టులో యజమానిపై వ్యాజ్యం దాఖలు చేసింది. ఎక్కువ పని గంటలు పనిచేయిస్తున్నప్పటికీ తక్కువ వేతనం చెల్లిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తన యజమాని పాస్‌పోర్ట్‌ను బలవంతంగా లాక్కొని ఇంటిపనులు చేయిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బాధిత మహిళకు 184,000 పౌండ్స్‌ ( రూ.1,54,69,633 ) చెల్లించాలని తీర్పు చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com