కరీనా కుమారుడికి పుట్టిన రోజు కానుకగా ఏకంగా అడవినే రాసిచ్చారు..!!
- December 21, 2017
ఉన్నవాడు ఉన్నవారికే పెడతాడు... లేని వాడు ఉన్నవాడికే పెడతాడు అనే సామెత.. ధనవంతుల ఇంట్లో , సెలబ్రిటీల ఇంట్లో ఫంక్షన్లు జరిగే సమయంలో గుర్తుకు వస్తుంది. తాజాగా బాలీవుడ్ "పటౌడి" దంపతులైన సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ల ముద్దుల తనయుడు తైమూర్ అలీ ఖాన్ మొదటి పుట్టిన రోజును బుధవారం అంగరంగ వైభవంగా నవాబ్ స్టైల్ లో జరుపుకొన్నాడు. ఈ వేడుకలను హరియాణాలోని రూ. 800 కోట్ల విలువైన పటౌడీ ప్యాలెస్ లో నిర్వహించారు. ఈ వేడుకల్లో కపూర్ కుటుంబం తో పాటు.. పటౌడీ కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు.. కాగా కరీనా తో పాటు.. పలువురు బాలీవుడ్ ప్రముఖులకు పోషకాహార నిపుణురాలుగా వ్యవహరిస్తున్న రుజుతా దివాకర్... తైమూర్ కు పుట్టిన రోజు కానుకగా ఏకంగా అడవినే రాసి ఇచ్చేసింది. ఈ విషయాన్ని రుజుత తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ.. తైమూర్ పెద్దయ్యాక ఈ అడవిని చక్కగా సంరక్షిస్తాడని కామెంట్ కూడా జత చేస్తూ.. ఒక ఫోటోని పోస్ట్ చేసింది. కాగా ఈ అడవి.. మహారాష్ట్ర పాల్ఘార్ ప్రాంతంలో సోనావే లో ఉన్న అడవి అని బీ టౌన్ వర్గ టాక్.. కాగా తైమూర్ పుట్టిన రోజు వేడుకల ఫోటోను కరీనా అక్క కరిష్మా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల