నిరాడంబరంగా జగన్‌ బర్త్‌ డే వేడుకలు

- December 21, 2017 , by Maagulf
నిరాడంబరంగా జగన్‌ బర్త్‌ డే వేడుకలు

 అనంతపురం :  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా నల్లమడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  దీంతో వైఎస్‌ జగన్‌ బస చేసిన శిబిరం వద్ద పండుగ వాతావరణం దర్శనమిచ్చింది. పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. భారీ కేక్ కట్ తెప్పించి వైఎస్‌ జగన్‌ చేత కట్ చేయించారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు.... ఆయన  సూచించారు.  ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ ఈ సారి ప్రజలతో కలిసి, ప్రజల మధ్య నిరాడంబరంగా పుట్టినరోజు జరుపుకోవడం విశేషం.

వేడుకల అనంతరం నల్లమడ క్రాస్‌ నుంచి 41వ రోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు.  రాగనిపల్లి, గోపేపల్లి, రామాపురం మీదుగా.... బొగ్గల పల్లి వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. దారి పొడవునా ప్రజలందర్నీ పలకరించుకుంటూ, సమస్యలను తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారు. మరోవైపు వైఎస్‌ జగన్‌ బర్త్‌డే సందర్భంగా పార్టీ కార్యకర్తలు... తెలుగు రాష్ట్రాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com