రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.2
- December 21, 2017
"కుమారి 21F" లాంటి యూత్ ఫుల్ & సెన్సేషనల్ హిట్ అనంతరం ఆ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్, కథానాయకుడు రాజ్ తరుణ్ ల క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీటవ్వనుంది. ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా రామ్ తాళ్ళూరి ఈ క్రేజీ ప్రొజెక్ట్ ను నిర్మించనున్నారు. "కుమారి 21F" తరహాలోనే యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో యువతను ఆకట్టుకొనే అంశాలన్నీ పుష్కలంగా ఉండడం విశేషం.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రామ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. "హిట్ కాంబినేషన్ పల్నాటి సూర్య ప్రతాప్-రాజ్ తరుణ్ ల కాంబినేషన్ లో మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.2గా రూపొందించనుండడం ఆనందంగా ఉంది. సూర్యప్రతాప్ చెప్పిన కథ విని ఎంతగానో ఎగ్జయిట్ అయ్యాను, యూత్ ఫుల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న రోమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. "కుమారి 21F"ను మించిన స్థాయిలో ఈ సినిమా ఉండబోతోంది" అన్నారు.
రామ్ తాళ్ళూరి ఇటీవల రవితేజ-కళ్యాణ్ కృష్ణల కాంబినేషన్ లో ఒక సెన్సేషన్ ప్రొజెక్ట్ ను ఎనౌన్స్ చేసారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







