అద్దాల మేడలలో ప్రమాదకర పనులు చేసేవారిని ప్రశంసించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్

- December 21, 2017 , by Maagulf
అద్దాల మేడలలో ప్రమాదకర పనులు చేసేవారిని ప్రశంసించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్

దుబాయ్:" కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిదాన ..బుగ్గమీద గులాబిరంగు ఎలావచ్చెనో చెప్పగలవా ? నిన్నుమించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే ..వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చిచేరెనని తెలుసు కోమని  మహాకవి శ్రీశ్రీ ఈ పాటలో సోషలిజం లోని కొన్ని అంశాల్ని మన అందరికి ఒక పాట రూపంలో చెప్పడం ఇక్కడ విశేషం. కానీ , మనసున్న మా రాజులకే శ్రామికులపై జాలి కల్గితే...?  యూఏఈ లోని దుబాయ్ నగరంలో ఎత్తైన భవంతులు ఉంటాయి. గాజు, స్పటికం సంబంధిత వస్తువులతో అలంకరించిన భవనాలు ధగధగ మెరుస్తూ పర్యాటకులను ఆకర్షిస్తాయి. వీక్షకులకు ధగ ధగ మెరిసే భవనాల అందాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ భవనాల అద్దాలను నిత్యం ప్రాణాలకు తెగించి తాళ్లపై వేళాడుతూ శుభ్రం చేసే వందల మంది కార్మికులు మాత్రం ఎవరికీ కనిపించరు. కానీ, కార్మికుల కష్టాలు తనకు కనిపిస్తాయని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ షేక్ హమ్మద్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముఖ్తూం రుజువు చేసుకొన్నారు.  సోషల్ మీడియాలో ట్విట్టర్‌లో ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం  వైరల్‌గా మారింది. ఓ కార్మికుడు తాడుపై వేళాడుతూ ఓ భవన అద్దాన్ని శుభ్రం చేస్తున్నాడు. పనిలో నిమగ్నమై ఉన్న కార్మికుడి కష్టాన్ని మహమ్మద్ తన సెల్‌ఫోన్‌తో వీడియో తీసి దానిని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ కార్మికుని కష్టానికి తన ప్రత్యేక  ధన్యవాదాలు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వీడియోను గంటల వ్యవధిలోనే 88,500 మంది షేర్ చేశారు. మహమ్మద్ మంచి వీడియోని పోస్టు చేశారని నెటీజన్ల నుంచి ప్రశంసలు వెలువడుతున్నాయి. మనసున్న మారాజని అయన మరోమారు  నిరూపించుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com