స్వచ్ఛభారత్‌కు రూ.666కోట్ల విరాళాలు.!
- December 21, 2017
కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ సాకారం కోసం ప్రముఖుల నుంచి సామాన్యపౌరుల వరకు తమ వంతు కృషి చేస్తున్నారు. మరికొందరు విరాళాలు అందిస్తూ ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నారు. అలా 2014లో స్వచ్ఛభారత్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు స్వచ్ఛభారత్ ఖజానాకు రూ. 666కోట్లకు పైనే విరాళాల రూపంలో అందాయట. ఈ మేరకు కేంద్రప్రభుత్వం గురువారం లోక్‌సభకు వెల్లడించింది. స్వచ్ఛభారత్ మిషన్ కోసం ప్రజల నుంచి అందిన విరాళాలపై కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ సహాయమంత్రి రమేశ్ చండప్ప లోక్‌సభకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. '2014-15లో ప్రభుత్వానికి రూ. 159కోట్ల విరాళాలు అందాయి. 2015-16 సంవత్సరంలో రూ. 253కోట్లు, ఆ తర్వాత 2016-17 సంవత్సరంలో రూ. 245కోట్లు విరాళాలుగా వచ్చాయి. ఇక 2017-18లో ఇప్పటివరకు రూ.8కోట్లు విరాళాలుగా అందాయి' అని రమేశ్ తెలిపారు. ఇందులో రూ. 633.98కోట్లను ఇప్పటికే స్వచ్ఛభారత్ మిషన్ కోసం ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల