హైదరాబాద్ లో ప్రేమోన్మాది అరాచకం

- December 21, 2017 , by Maagulf
హైదరాబాద్ లో ప్రేమోన్మాది అరాచకం

నార్త్ జోన్ పరిధిలోని లాలాగూడాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించలేదని ఓ యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పటించిన ప్రేమోన్మాది. నడుచుకుంటూ వెళ్తున్న సంధ్యారాణి(22) అనే యువతిపై  ప్రేమించలేదన్న కారణంతో ఓ ప్రేమికుడు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.  70 శాతానికి పైగా కాలిపోయి తీవ్ర గాయాలయిన యువతిని గాంధి ఆస్పత్రికి  తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

కార్తీక్‌ అనే యువకుడు ఘటన జరిగిన కాసేపటికి  తానే పెట్రోలు పోసి నిప్పుపెట్టినట్లు చెప్పాడు. దీంతో యువతిని ప్రేమించిన వ్యక్తే దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. ముందుగానే కార్తీక్‌పై యువతి సోదరుడు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడు ఫోన్ చేసిన టవర్ లొకేషన్ లాలాగూడా పోలీసులు చేధించారు. సంధ్యారాణి శాంతినగర్ లోని  లక్కీ  ట్రేడర్స్‌లో ఉద్యోగిగా పనిచేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com