డిసెంబర్ 31న పవన్ 'కొడకా.. కోటేశ్వరరావు' వస్తున్నాడు

- December 22, 2017 , by Maagulf
డిసెంబర్ 31న పవన్ 'కొడకా.. కోటేశ్వరరావు' వస్తున్నాడు

పవర్ స్టార్ పవన్ నటించిన అజ్ఞాతవాసి ఎప్పుడు రిలీజవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈలోపు చిత్ర యూనిట్ అప్పుడప్పుడు ఆ చిత్రంలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ అభిమానుల్ని ఆనందపరుస్తున్నారు. ఈ 31న పవన్ పాడిన కొడకా కోటేశ్వరరావు పాటను విడుదల చేస్తామంటూ మరో తీపి కబురు చెప్పారు అభిమానులకి. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేదిలో కాటమరాయుడా.. కదిరీ నరసింహుడా అంటూ పాట పాడి ఆడియన్స్ చేత స్టెప్పులేయించిన పవన్.. ఇప్పడు ఈ పాటతో మరోసారి దుమ్ములేపేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అనిరుధ్ ట్యూన్స్ ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com