ఇండియాలో టాప్‌ సెలబ్రిటీలు వీరే..!

- December 22, 2017 , by Maagulf
ఇండియాలో టాప్‌ సెలబ్రిటీలు వీరే..!

ప్రతి ఏడాది  ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించే, ఫోర్బ్స్‌ ఇండియా సెలబ్రిట్‌ 100 జాబితాలో ప్రముకంగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వరుసగా రెండవ ఏడాది కూడా టాప్ ప్లేస్ ను సొంతం చేసుకున్నారు.. 2016 లో టాప్ పొజిషన్ ను అందుకున్న సల్మాన్ తన వార్షిక రాబడి 232.83 కోట్లతో మరోసారి ఆస్థానాన్ని నిలబెట్టుకున్నారు.. ఇక బాలీవుడ్ బాద్షా షారూక్‌ ఖాన్‌​ రూ 170 కోట్లతో జాబితాలో రెండో స్ధానంలో నిలవగా , టీమిండియా కెప్టెన్‌, విరాట్‌ కోహ్లి రూ 100.72 కోట్లతో 3 వ స్థానంలో నిలిచాడు. అంతేకాదు తన భార్య అయిన బాలీవుడ్ నటి అనుష్క శర్మ రూ 28 కోట్ల వార్షికాదాయంతో 32వ స్ధానం దక్కించుకున్నారు.. ఆ తర్వాత అక్షయ్‌ కుమార్‌ నాల్గవ స్థానంలో వీరి తర్వాత వరుసగా సచిన్‌ టెండూల్కర్‌, అమీర్‌ ఖాన్‌, ప్రియాంచ చోప్రా, ధోని, హృతిక్‌ రోషన్‌, రణ్‌వీర్‌ సింగ్‌లు టాప్‌ 10లో స్ధానం దక్కించుకున్నారు.. కాగా ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్, ఇండియా సెలబ్రిటీ 100 జాబితా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com