ఒక పనిమనిషి ఉరి వేసుకొని బలవన్మరణం ..మరో పనిమనిషి గోడకు తల బాదుకుని ఆత్మహత్యాయత్నం
- December 22, 2017
కువైట్: బతుకుతెరువు కోసం కువైట్ కు వచ్చిన గృహ సేవకురాళ్లు వేర్వేరు ఘటనలలో ఒకరు ఉరి వేసుకొని చనిపోగా, మరొక పనిమనిషి గోడకు తన తలను బాదుకుని ఆత్మహత్యయత్నంకు పాల్పడింది. స్థానిక రేక్క్త్ లో ఒక యజమాని ఇంటిలో పనిమనిషిగా పనిచేస్తున్న ఫిలిప్పిన్ మహిళ బలవన్మరణం చేసుకొన్నట్లు కేసు దాఖలైంది.మృతురాలు తన స్పాన్సర్ ఇంటిలో అనుమానాస్పదరీతిలో విగతజీవిగా కనబడింది. గృహ యజమానురాలు పనిమనిషి కనబడకపోవడంతో ఆమె పడకగదిని తనిఖీ చేయగా పైకప్పు నుండి ఉరి వేసుకొని కిందకు వేలాడుతూ నిర్జీవంగా కనబడినట్లు ఆమె తెలిపారు. ఈ కేసులో దర్యాప్తులు కొనసాగుతూ ఉండగా మరో కేసులో ఒక ఇథియోపియన్ గృహ సేవకురాలిని అల్-సబా హాస్పిటల్ కు తరలించారు. ఆ మహిళ సులాబిఖత్లోని తన స్పాన్సర్ ఇంటిలో ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో అనేకసార్లు ఆమె తలను గోడ కేసి కొట్టుకోవడం ద్వారా ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించింది. తల నుంచి తీవ్రంగా రక్తసిక్తమైన గాయాలతో ఆసుపత్రికి తరలించబడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల